నాకు ఎం చెప్పాలో తెలియక పోయినా ఏదో చెప్పాలి అనే ఆశ నాలోపల చాలా బలంగా ఉంది....
కానీ ఎం చెప్తాం??? అసలు మనం చెప్పే మాట నిజంగా మనసు పెట్టి విందాం అని ఎవరికైనా అనిపిస్తాధ?
అలా వినే మనిషి ఒకలు ఉంటే ఎంతో బాగుంటాది అని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు, కానీ నిజంగా ఒక మనిషి వెళ్లి నీకు నేను ఉన్న నీ మనసులో బాధ ఏమైనా ఉంటే నాకు చెప్పుకో అంటే వెటకారంగా నవ్వుతాం, ' హా వచ్చాడు! కావాలని కలవడానికి చూస్తున్నాడు అనుకుంటారు.' 
నిజంగా మన కోసం వచ్చిన మనిషి ని కచ్చితంగా వీళ్ళే అని ఎలా చెప్పగలం?
పెళ్ళిళ్ళు స్వర్గం లో నిర్ణయించ బడతాయి అంటారు, కానీ అలాంటి పెళ్ళిళ్ళు ఎందుకు విడిపోతాయి?
ప్రేమించి పెళ్లి చేసుకున్న వి కొన్ని విజయం సాధిస్తే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న వి కొన్ని విజయం సాధిస్తున్నాయి.
అలానే రెండు సందర్భాల్లో నూ పెళ్ళిళ్ళు విఫలమైన సన్నివేశాలు ఉనాయి.
మన తలరాత ఇంతే అని ఊరుకోవాలా?
మన తలరాతను తిరిగి రాసుకునే వరకు పోరాడాల?
ఒక మనిషి తో కొంత కాలం కలిసి పయనిస్తే నే గాని వారి అలవాట్లు కట్టుబాట్లు పద్ధతులు తెలియవు.... అలా అని అందరితో ప్రయాణించి నిర్ణయించ లేము...అలాంటప్పుడు అబ్బాయి అయిన అమ్మాయి అయిన తల దించుకుని పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకోవాల్సిందే న?
ఇన్ని చేసిన ఆ భగవంతుడు జీవితం మొత్తం కలిసి బ్రతకాల్సిన మనిషిని కూడా ఇతనే/ఈమె నీ భాగస్వామి అని చెప్పేస్తే బాగుండు అని ఒకసారి అనిపిస్తే, అన్ని ఆయనే చెప్పేస్తే ఇంక మనం ఎం చేస్తాం అనిపిస్తాది.....
ఇంతటి క్లిష్ట మైన పెళ్లి అనే ఈ విషయాన్నీ మనం మెదడు తో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా? మనసు తో ఆలోచించి తీసుకోవాలా?
ఒద్దు పొడుగు రంగు నప్పితే పెళ్లి చేసేస్తే అసలు అది శారీరాక వ్యభిచారం అవ్వధా?
తల్లితండ్రుల పెంపకం అహ్ బిడ్డ మీద ప్రభావం ఏ విధంగా ఉందో ఎలా తెల్సుకుంటాము?
ప్రేమించిన వాళ్ళు జీవితం మొత్తం ఇపుడు ఉన్నటే ఉంటారని నమ్మకం ఎలా కల్పిస్తాం ఇంట్లో పెద్దలకి? పెళ్లి కి ఎలా ఒప్పిస్తాం?
అసలు జీవితం లో పెళ్లి చేసుకోకుండా ఉంటే తప్పేంటి అనే ఆలోచన ఎపుడైనా మీకు వచ్చిందా??
అదే సమయం లో పెళ్లి చేసుకుని చక్కటి పిల్లతో జీవితాన్ని ఊహించారా?
నాకు మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయా?
ప్రతి ఒక్కలు కూడా బయటకి అన్ని తెలిసినట్టు గంభీరంగా ఉంటారా?
కొంపతీసి సరిగ్గా నిద్రపొక పోతే ఇలా తయారవుతూ ఉంటారా?
#Mk
Comments
Post a Comment