అందరి దృష్టి ఎరుపు రంగు మీదన మాత్రమే ఉంది , తనది కూడా అలాగె ఉంటె హీరో ఎందుకు అవుతాడు , ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఒక కన్ను ఎరుపు పిక్క మీద  ఇంకో కన్ను దృష్టి మొత్తం తరువాత కొట్టబో యే తెలుపు పిక్క  మీదే పెట్టాడు . ఒక కన్ను మూసి ఇంకొక కన్ను లక్ష్యం మీద పెట్టి ఒక చక్కని స్ట్రైక్ చేశాడు.
     టాక్.........
ఒక్కసారి గా అతని ఆట మొత్తం ఒక పెద్ద తెర మీద చూస్తున్న జనాల నోర్లు ఆశ్చర్యం తో తెరుచుకునే ల చేసింది ...... భూమి సూర్యుని చుట్టు గిర గిర తిరిగినట్టు తను కొట్టిన స్ట్రైకర్ బోర్డ్ మొత్తం ఒక చక్కెర వేసి మొదట ఎరుపు కాయిన్ అహ్ వెంటనే తెలుపు కాయిన్ వెళ్లిపోయాయి , అంతా సులువుగా అయిపోతే ఇంకెందుకు ఆడియెన్స్ ఎక్సయిట్ అయ్యేది అహ్ చివర్లో తన స్ట్రైకర్ కన్నం చివరి వరకు వచ్చి సగం స్ట్రైకర్ కన్నం లో పడిపోయే దాకా వచ్చింది.....
ఇదంతా అవతల అభ్యర్థి చూస్తూ ఒక్క క్షణం అహ్ స్ట్రైకర్ వెళ్లిపోవాలి అని ఎంత మంది దేవుళ్ళకి మొక్కి ఉంటాడో అతనికే తెలియాలి.......
కానీ వాళ్ల ప్రార్థన నెరవేరితే మన హీరో ఎందుకు గెలుస్తాడు . కదా ! అందుకే మనవాడే నేగ్గాడు .
అహ్ ఆట చూస్తున్న ఫ్యాన్స్ లో మన హీరోయిన్ కూడా ఉంది. ఎటువంటి పక్షపాతం లేకుండా ఎవరు నెగ్గుతారు అని ప్రేక్షకులని అడిగే వృత్తి తనది ...... అయినా కూడా మనసులో మాత్రం తన ఎంతో అభిమానించే తనకి ఎంతో ఇష్టమైన ప్లేయర్ అయిన ' సత్యం ' మాత్రమే నెగ్గాలి అని ప్రత్యర్థి చేసిన ప్రార్థన కంటే ఎక్కువే చేసింది. బహుశా అందుకే దేవుడు కూడా ప్రేమ కి ఎక్కువ విలువ ఇచ్చి తన హీరో నే గెలిపించాడు.....
ఇంతకీ స్టోరీ కట్ చేస్తే ఒక నాలుగు సంవత్సరాల వెనక్కి వెళితే.....
సత్యం ఒక సాధారణ స్టూడెంట్ , చిన్నపటి నుంచి స్నేహితుల తో ఆడుకునే ఈ కార్రమ్స్ అంటే ఎందుకో తెలీదు కానీ తనకి మాత్రం అది ఒక ప్రత్యేకమైన అభిమానం ఇష్టం గౌరవం . ఎప్పటికైనా తనకు ఎంతో ఇష్టమైన ఆటే తనకు గొప్ప కీర్తి ని తీసుకొస్తుంది అని చిన్న వయస్సు నుంచే బలంగా నమ్మాడు. దాని మీదే దృష్టి మొత్తం . ఏమి చేసిన ఎంత కష్టపడినా తన ఇంట్లో మాత్రం ఆటలు మనకు కూడు పెట్టవు అని ఇంట్లో ప్రోత్సహించే వారు కాదు. మన మధ్య తరగతి తల్లిదడ్రులందరికి చదువుకు మించి యే విషయం మీద ఏకాగ్రత పెట్టిన నచ్చదు కదా....... కానీ తను మాత్రం తన మనసులో చిన్ననాటి వయసులో నాటుకున్న అహ్ కోరిక మాత్రం తన వయసు తో పాటు బలంగా లోపల వృక్షం లా తయారయ్యింది . ఇంట్లో వాళ్ళకి తెలియకుం డా మొదట స్కూల్ తరఫున తరువాత కాలేజి తరఫున   ఎపుడు ఇతనే ఫస్ట్. డిస్ట్రిక్ట్ తరఫున కూడా తన ప్రతిభను చాటుకున్నా డు. అప్పుడే సరిగ్గా అన్ని మంచిగా జరుగుతున్న రోజుల్లో ఇంట్లో పరిస్థితి తలకిందులు అయింది. నాన్న కి ఆరోగ్యం క్షీణించడం , అమ్మ ఒక్కదే ఇంట్లో కష్టపడడం  , ఏమి చేయాలో అర్ధం కాలేదు , చదువు పక్కన పెట్టీ తన నాన్న వృత్తిని తన వృత్తిగ మార్చుకుని ఇంటికి ఒక అండగా నిలిచాడు , కష్టపడ్డాడు . ఎంత కష్టపడ్డాడు అంటే  , తన ఆట తో సమానంగా ఇష్టపడ్డ అమ్మాయి వచ్చి నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పిన కూడా ఒక మౌనం మాత్రమే తన సమాధానంగా బదులు ఇచ్చాడు........
నిజమైన ప్రేమ ప్రేమించడం లో కంటే ప్రేమించిన వాళ్ళని అర్ధం చేసికొడం లోనే ఉంటుంది అని ఎవరో చెప్పినట్టు......రమ్య కూడా తన ప్రేమను మౌనంగా ఆరాధిస్తూ తన తదుపరి భవిష్యత్తు మీద దృష్టి పెట్టి....తన వృత్తి సహాయం తో తన ప్రేమికుడు లాంటి ఎంతోమంది అజ్ఞాత ప్రతిభ ను వెలుగులోకి తీసుకొచ్చింది .......ఎన్నో సార్లు ఆమె అతనిని అడిగింది " నేను ఎక్కువ నీకు నీ ఆట ఎక్కువ అని " ప్రతిసారీ ఆమె కి అతని మౌనమే సమాధానంగా దొరికేది.....
ఇప్పటి సన్నివేశం లోకి వచ్చేస్తే.....
 అహ్ స్ట్రైకర్ ఆగిన వెంటనే తన గుండె కొట్టుకోవడం మొదలు పెట్టింది.....కంటి నుంచి ఆనంద బాష్పాలు , చేతులు నొప్పి వస్తాయేమో అనే లాగా జనాల కెరటాల తాకిడిని చూసి తన గుండె పులకించిపోయింది ......గట్టిగా అరిచి తన గుండెల్లో మాత్రమే మిగిలి ఉన్న తన తండ్రికి ' నేను సాధించ నాన్న ' అని చెప్పాడు.
వెంటనే తన కోసం అమ్మ తరువాత అంత ప్రేమ ను చూపించిన మౌన ప్రేయసిని చూసాడు....మాటలు మించిన మౌనం, కన్నులు మించిన చూపులు, చెవులను మించిన ఆనంద ధ్వనులు ....అన్నీ ఒకేసారి ఆస్వాదించి.. తనే తన ప్రపంచం గా అనుకున్నాడు.
#మౌనప్రేమ
Good one
ReplyDeleteVere level
ReplyDelete